01-04-2025 02:12:22 AM
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): హెచ్‌సీయూ భూములను రక్షించేం దుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయ డంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బం డి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కు కనీస మానవత్వం లేదని.. భూముల రక్ష ణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్లను గొడ్డును బాదినట్లు బాదారని, అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని లాక్కుపోయి చితకబాదారని విమర్శించారు.
తెలంగాణలో గ్రీన్‌మర్డర్ జరుగుతోందని.. గొడ్డలి అదేనని చేతులే మారాయంటూ గత, ప్రస్తుత ప్రభుత్వాలపై ఆయన మండిపడ్డా రు. భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా.. భూముల మ్మి వేల కో ట్లు సంపాదించి దండు కోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా..? అంతమాత్రా న మీరెందుకు..
కేఏ పాల్‌కు బాధ్యత అప్పగించినా అదేపని చేస్తారు కదా.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రూముల్లో దూరి కొట్టారని ఇందుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, మొత్తం ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూ ముల అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్ద తు ప్రకటిస్తోందన్నారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహ ణ అంతా గందరగోళంగా ఉందన్నారు.