calender_icon.png 11 January, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం...

05-01-2025 05:31:46 PM

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి...

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి...

కోదాడ (విజయక్రాంతి): పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1,03,35,500 రూపాయల 291 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, టిపిసిసి డెలిగేట్స్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వివిధ మండలాల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.