calender_icon.png 1 February, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

31-01-2025 01:15:45 AM

వనపర్తి, జనవరి 30 (విజయక్రాంతి):  అమలు కానీ హామీలను ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లో విఫలం అయ్యిందని  బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ పార్టీ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ లు అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యములో వినతి పత్రం సమర్పించడం జరిగింది. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజులలో హామీలు అన్ని హామలు చేస్తామని చెప్పి నేటికీ 420రోజులు గడిచినా రైతు భరోసా రైతు రుణ మాఫీ,రైతు బోనస్ యెగ్గొట్టిందని అదేవిధంగా మహిళకు 2500, తులం బంగారం,వద్ధులకు 4000 ఫించన్లు ఇస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ బి.లక్ష్మయ్య, జాత్ నాయక్, గంధం.పరంజ్యోతి, మాజీ కౌన్సిలర్స్ బండారు కష్ణ, నాగన్న యాదవ్,కంచే.రవి, . తిరుమల్, ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్ ,రమేష్ నాయక్,గులాం ఖాదర్ ఖాన్,ఇమ్రాన్,అవుల.రమేష్, నందిమల్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.