హామీలు అమలు అయ్యేవరకు పోరాడుతాం
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): వంద రోజుల్లో ఇచ్చిన హామీలను చేస్తామని చెప్పి 420 రోజులైనా హామీలు అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా హామీలు అమలు పరచకపోవడాన్ని నిరసిస్తూ కల్లు గీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవితో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు.అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా జనవరి 30న 420 రోజులు పూర్తిచేసుకుంటోంది. మోసపూరిత వాగ్దానాలతో ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ కార్డు హామీలకు పాతరేసి,డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి, డిక్లరేషన్ల పేరుతో,గ్యారంటీల పేరుతో బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పగిళ్ల సతీష్, మాజీ ఎంపీటీసీలు పొలగోని సైదులు,ఈద శరత్ బాబు, మందుల సత్యం, మేకల శ్రీనివాస్, బోయపర్తి సురేందర్, ఎడవల్లి సురేష్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.