calender_icon.png 14 March, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

14-03-2025 05:14:13 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. శుక్రవారం పట్టణం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజా గంగన్న మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి నియంతృత్వ పోకడలు చేస్తూ నిర్బంధంగా పరిపాలన సాగిస్తుందన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటని, ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ప్రదీప్, గజేందర్, గౌరీకర్ రాజు, శ్రావణ్, పలువురు నాయకులు ఉన్నారు.