calender_icon.png 4 February, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాభా లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు..

04-02-2025 08:05:32 PM

అస్తవ్యస్తంగా కుల గణన..

బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు..

హుజురాబాద్ (విజయక్రాంతి): బీసీ కుల గణన జనాభా లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుందని బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్నారు. కుల గణన జనాభా లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని, ఓసిల జనాభా పెరిగినట్టు చూపుతున్న ప్రభుత్వం నేటి జనాభా ప్రకారం కాకుండా తన ఆలోచన సరళిని మార్చుకొని కేసిఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో ఎంత జనాభా ఉందో లెక్కలు తీస్తే తెలుస్తుందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తే ఉపకులాలకు పూర్తిస్థాయిలో అన్యాయం జరిగే అవకాశాలుంటాయని ప్రభుత్వానికి విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.