calender_icon.png 26 February, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం వాతలు

13-02-2025 02:12:57 AM

హోంగార్డుల వేతనాలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): పథకాల్లో కోతలు పెట్టడంతోపాటు జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు ప్రభుత్వం వాతలు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హోంగార్డులకు జీతాలు చెల్లించక పోవడం పట్ల ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యా రు. రాష్ర్ట వ్యాప్తంగా 16వేలకుపైగా హోంగార్డులు ఉండగా వారికి ఇప్పటి వరకూ జీతా లు చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు.

చిరు ఉద్యోగులు చేతిలో చిల్లి గవ్వ లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రతినెలా ఇదే తీరు కొనసాగుతుందని విమర్శించారు. హోంగార్డులకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హోంగార్డుల వేతనాలు తక్షణం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.