పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గుర్తింపు
సుడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్‌కు ఘన సన్మానం
మధిర,(విజయక్రాంతి): ఖమ్మంలోని ఎన్.ఆర్. గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన సుడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్ అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పులిబండ్ల చిట్టిబాబు తదితర నాయకులు పాల్గొని పువ్వాల దుర్గాప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.
అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, పట్టణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. సుడా చైర్మన్‌గా పువ్వాల దుర్గాప్రసాద్ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో సముచిత గౌరవం దక్కుతోందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పువ్వాల దుర్గాప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.






