calender_icon.png 4 April, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పరిరక్షణనే కాంగ్రెస్ ధ్యేయం

03-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమాన పరిచిందే బిజేపి,రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ,గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది.

'రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాలంటూ హన్మకొండ జిల్ల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  బుధవారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో 47, 62, 63 డివిజన్ లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కాజిపేట చౌరస్తా నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ అంబేద్కర్ వారసత్వం, విలువలను కాపాడటానికి, దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలను ఐక్యత, సామాజిక న్యాయం సందేశంతో అనుసంధానించడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, తోట వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్లు సుంచు అశోక్,  మొహమ్మద్ అబూబాకర్, గుంటి  కుమారస్వామి, వీరగంటి రవీందర్, జై భీం, జై బాపు, జై సంవిధాన్ ఇంచార్జి డాక్టర్ పులి అనిల్ కుమార్,  జిల్లా అధికార ప్రతినిధి బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు మహమ్మద్ అంకుష్, డివిజన్ అధ్యక్షులు షేక్ అజ్గర్, పాలడుగుల ఆంజనేయులు, పోగుల సంతోష్, నాయిని లక్ష్మా రెడ్డి, బంక సంపత్ యాదవ్, తమ్మిడి మానస, నాగపురి లలిత, అరూరి సాంబయ్య, రంగు సుదీర్, గుంటి స్వప్న, పోగుల శ్రీనివాస్, సిరిల్ లారెన్స్, దొంగల కుమారస్వామి, చీకటి ఆనంద్, బుర్ర బాబు రావు, రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు