29-03-2025 06:22:46 PM
అందుకే జై బాపు.. జై భీం.. జై సంవిధాన్..
నినాదం ఇంచార్జి జనక్ ప్రసాద్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ సర్కార్ మతపరమైన రాజకీయాలతో నియంతృత్వ పోకడలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డ్ చైర్మన్, జై బాపు..జై భీం..జై సంవిధాన్ ఇంచార్జి జనక్ ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం నిర్వహించిన జై బాపు.. జై భీం... జై సంవిధాన్ జిల్లా సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ ప్రతులను ఆవిష్కరించి ప్రతిఒక్కరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈమేరకు జనక్ ప్రసాద్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం కోసం ఆవిర్భవించిన పార్టీ అయితే బీజేపీ కేవలం మతపరమైన పార్టీ అన్నారు. అభివృద్ధిని మరిచి మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడమే నైజంగా దేశాన్ని పాలిస్తున్న పార్టీ అని విమర్శించారు.