- * ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- * ఉమ్మడి పాలమూర్ జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా చేసి తీరుతాం
- * ఉమ్మడి పాలమూర్ జిల్లాలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలోనే
- * పాలకుల కోసం గత ప్రభుత్వం పని చేస్తే ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది
- * వ్యవసాయేతర భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నాం
- * గత ప్రభుత్వంలో మాటలు తప్ప చేసింది ఏమి లేదు: పర్యాటక, అబ్కారి, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- * స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి: రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
- * రైతుల కోసం రూ 70 వేల కోట్లు ఖర్చు పెట్టాం: రాష్ర్ట స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివ సేనా రెడ్డి
- * వనపర్తి నియోజకవర్గంను రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తా: ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి, జనవరి 9 ( విజయక్రాంతి ): ఉమ్మడి పాలమూర్ జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను జూరాల, కోయిల్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించ డం జరిగిందని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీటిని అందిస్తున్నామని చివరికి పాలమూ రు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం జిఓ ఇచ్చింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క మల్లు అన్నారు.
గురువారం వనపర్తి నియోజకవర్గ పరిధిలో రేవల్లి మండలం తలుపునూర్, గోపాల్ పేట మండలం ఎదుట్ల గ్రామాల్లో నూతన సబ్ స్టేషన్, జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద వివిద మండలా లకు సంబందించిన 7 సబ్ స్టేషన్ నూతన నిర్మాణం కోసం వర్చవల్ పద్ధతినా స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, అబ్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, రాష్ర్ట స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివ సేనా రెడ్డి, ఎంపీ మల్లు రవి, గద్వాల మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత, స్థానిక నాయకులతో కలిసి వేరువేరుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రం లోని కళ్యాణ సాయి ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, రైతుల సమావేశానికి హాజరు అయ్యా రు.
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ... వనపర్తి నియోజకవర్గం లో దాదాపు రూ 70 కోట్ల విలువ గల పనులను స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి పట్టుబట్టిమంజూరు చేయించుకుని అందులో 2 సబ్ స్టేషన్ ప్రారంభం తో పాటు అదనంగా 7 నూతన సబ్ స్టేషన్‌ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతోనే రాష్ర్టము అభివృద్ధి చెందుతుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ప్రజలంతా ఆత్మ గౌరవంతో బతకాలని ప్రజలంతా ఏకమై కొట్లాడి రాష్టా న్ని సాధించుకున్నామని ఆనాడు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కు ఇబ్బందులు అవుతుందని తెలిసిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
ధనిక రాష్ర్టముగా తెలంగాణ ను బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేతిలో ప్రజలు పెడితే గడిచిన 10 ఏండ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి అప్పుల తెలంగాణగా మార్చడం జరిగిందన్నారు.
అప్పుల కూపం లో తెలంగా ణ రాష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కు అప్పజెప్పితే ఒక వైపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలను కడుతూనే మరొక వైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ రోజుకు 18 గంటలు కష్ట పడుతున్నామని ప్రజా పాలనను కొనసాగి స్తున్నామన్నారు.
మొదటి దశలోనే 7600 కోట్లను రైతుబంధు పేరు మీద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, రూ 2 లక్షల వరకు రుణ మాఫి చేస్తామని చెప్పడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారంగా రూ 2 లక్షల రుణమాపీ చేయ డం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు లక్ష లోపు రుణ మాఫి చేయడానికి చేయలేక పొగా అరకొర చేయడం చేసారని అవి కూడా బ్యాంకుల మిత్తిలకు సరి పోయాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్టంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని కార్యకర్తలు ప్రజలకు వివరిం చాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల వద్దకు వెళ్ళిన ప్పుడు రూ 2 లక్షల లోపు ఎవరికి అయిన కాలేదని చెప్పినట్లతే అలాంటి రైతు వివరాలు ఇవ్వండి వారికి కూ డా రుణ మాఫి చేసి తీరుతామని అయన సూచించారు.
రైతు భరోసాను ఎలా ఇవ్వాలి అనే అంశంపై రాష్టంలోని అన్ని జిల్లాలు తిరిగి రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేసే సమయంలో పలు సూచనలు వచ్చాయని అందు లో ప్రధానంగా 10 ఎకరాల లోపు ఉన్నవారికి, అదేవి ధంగా వ్యవసాయం చేయకుండా రాళ్లు రప్పలు ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వవద్దని చెప్పడం జరిగింద ని ఆయన గుర్తు చేశారు.
ఇచ్చిన మాట ప్రకారంగా రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరానికి రూ 12 వేలు, దేశం లో ఎక్కడా లేని విధంగా రైతు కూలీలకు కూడా సంవ త్సరానికి రూ 12 వేలను ఇందిరమ్మ భరోసా పథకం ద్వారా రూ 12 వేలను ఈ నెల 26 వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున వారి ఖాతాలో జమ చేయడం జరు గుతుందన్నారు.
కొంతమంది ప్రతిపక్ష నాయకులు రైతు భరోసా పథకం పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఇన్ని ఎకరాలు అని ఏమి లేదని వ్యవసాయేతర భూము లకు రైతు భరోసాను అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని కొంతమంది నాయకులు మాట్లాడారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రైతులకు నాణ్యమై న విద్యుత్తును అందిస్తూ ఇప్పటికే రైతుల కోసం వారి పక్షాన ప్రభుత్వం నిలబడుతూ రూ 12 వేల కోట్లు చెల్లెస్తున్నామన్నారు.
పంట నష్టపరిహారం, రైతు బీమా కింద రైతుల పక్షాన ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని, రైతులు బోర్లు, వ్యక్తుల కింద సాగు చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తున్నా మన్నారు. కేవలం ధర్మల్ విద్యుత్ కాకుండా 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశాం అన్నారు.
మిగులు కరెంటు ను ఇతర రాష్ట్రాలకు పంపేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాం, 500కే గ్యాస్ సిలిండర్, మొదటి దశలో నాలుగున్నర లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ నేతలు ప్రజలకు ఇచ్చిన మాట తప్పారని అవినీతి కార్యక్రమాల్లో మునిగి తేలుతు . రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు.
ప్రజల కోసం నిలబడేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే.. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు స్కేల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ రీజినల్ రింగ్ రోడ్డు మూసి పునర్జీవనం వంటి భారీ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. తొందరగా అధికా రం చేయపడదాం, అధికారంలోకి వచ్చి రాష్ర్ట ప్రజలను దోచుకుందామనే ఆలోచన తప్ప టిఆర్‌ఎస్ నేతలకు రాష్ర్ట ప్రజల ప్రయోజనాలు పట్టవు అని అన్నారు.
అన్నపూర్ణ జిల్లాగా చేసి తీరుతాం
పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి మీ అందరి ఆశీర్వాదంతో సీఎం అయ్యారన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలతో పాటు సి ఎం రేవంత్ రెడ్డి సైతం అండగా ఉన్నాడని ఆయన అన్నారు. ఒకనాడు వెనుకబడిన జిల్లా గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నపూర్ణ జిల్లాగా చేసి తీరుతామని ఆయ న వివరించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం చేస్తామని చెప్పి గత ప్రభుత్వ నాయకులు గాలికి వదిలేసి పోయారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టు పైన ప్రతినెల రివ్యూను నిర్వహించి పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తూ రాబోయే మూడేళ్ల లో ప్రాజెక్టును పూర్తి చేసి బీడు బారిన పంట పొలాలకు సాగునీరు అందిస్తామ న్నారు.
1980 నుండి ఈ పాలమూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృ ద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కరోనా బారిన పడి ప్రజలు ఇబ్బందు లు పడుతున్న నేపథ్యంలో సిఎల్‌పి నేతగా అన్ని జిల్లాలు తిరుగుతూ వనపర్తి జిల్లా ఆసుపత్రి కి రావడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చిన ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పని చేయడం జరుగుతుందన్నారు.
ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది
ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం పాలకుల కోసం మాత్రమే గత ప్రభుత్వం పని చేసిందని, ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశ పెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం కార్యకర్తలపై ఎంతైనా ఉందన్నారు.
ప్రజాపాలన ప్రభుత్వ ఏర్పడిన నాటి నుండి ప్రజల అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేరుస్తూ ముందుకు సాగుతు న్నామని గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వంకు గొప్పలు చెప్పుకోవడం రాదని పనులు చేసుకుంటూ పోవడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను గెలిపించు కోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.
మాటలు తప్ప చేసింది ఏమి లేదు
గత ప్రభుత్వ హయాంలో కోటలు డాటేలా మాటలు చెప్పారే తప్ప చేసింది ఏమీ లేదని ధనిక రాష్ర్టంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ర్టంగా మార్చారని గత ప్రభు త్వం చేసిన అప్పులకు నేటికీ మిత్తిలను కడుతూ ప్రభు త్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పర్యాట క, అబ్కారి, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో రైతులకు ట్రాన్స్ఫారం కావాలంటే చెప్పులు అరిగేలా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరిగేవా రని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు వితౌట్ ట్రాన్స్ఫర్ అందిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
పాలమూరు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నా రని అందులోనే భాగంగా రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్లతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యా వైద్యం వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి జరుగుతుందని రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు.
రైతుల కోసం రూ. 70 వేల కోట్లు ఖర్చు పెట్టాం
రైతన్న అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతోపాటు వ్యవసాయంగా బలోపిత దిశగా ముందుకు సాగుతుందని అందులో భాగంగానే ఇప్ప టికే రూ 70 వేల రూపాయలను ప్రజల కోసం ఖర్చు చేసిన ఏకైక రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ర్ట స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివ సేనా రెడ్డి అన్నారు.
రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తా
ప్రజలందరూ ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించారని గతంలో వనపర్తి నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధికి అభివృద్ధి చేసి ప్రజల కండ్ల ముందు ఉంచుతానని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలో గల గురుకులాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా రని నిధులు మంజూరు చేస్తే శాశ్వత భవనాలను నిర్మిస్తా మని, గ్రేడ్ 3 లో ఉన్న పాలిటెక్నిక్ ను గ్రేడ్ 2 లోకి మార్చాలని, పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో 30 పడకల ఆసుపత్రి, ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంజూరు చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్కను ఎమ్మెల్యే మేఘా రెడ్డి కోరారు.
ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, రాష్ర్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎంపీ మల్లు రవి, గద్వాల జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత, స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు