- ఎన్నికల బరిలోకి కుస్తీ యోధులు
- రాహుల్‌తో భజరంగ్, వినేష్ భేటీ
- ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ఎత్తు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టి కరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ‘గేమ్’ మొదలు పెట్టింది. ఇప్పటికే రైతుల వ్యతిరేకతతో ఉక్కి రి బిక్కిరి అవుతున్న బీజేపీని ఓ ‘ఆట’ ఆడుకోవాలని ప్రణాళికలు వేస్తున్నది. అందులో భాగంగానే మొన్నటివరకు బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ చరణ్‌సింగ్‌పై అలుపెరుగని పోరాటం చేసిన ప్రముఖ కుస్తీ (రెజ్లింగ్) క్రీడాకారులు వినేష్ ఫొగాట్, భజరంగ్ పూనియా ను అక్కున చేర్చుకొన్నది. పొగాట్ పెదనాన్ని కుమార్తె, రెజ్లింగ్ క్రీడాకారిణి బబిత ఇప్పటికే బీజేపీ వైపు వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ కూడా క్రీడాకారులపై దృష్టి పెట్టింది. కాంగ్రె స్ అగ్రనేత రాహుల్‌గాంధీతో భజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ బుధవారం సమావేశమయ్యారు.
హర్యానాలో సూపర్ స్టార్లు
దేశంలో రెజ్లింగ్ ఆటకు హర్యానా రాష్ట్రం పెట్టింది పేరు. అక్కడ ఇంటికో రెజ్లర్ ఉంటా రు. ఈ ఆటను హర్యానా వాసులు తమ జీవితంలో ఒక భాగంగా మార్చుకొన్నారు. దీంతో అంతర్జాతీయంగా భారత్‌కు రెజ్లింగ్‌లో పథకం వచ్చిందంటే అది హర్యానా క్రీడాకారులు తెచ్చేదే అయి ఉంటుంది. అం తర్జాతీయ స్థాయిలో మెరిసే కుస్తీయోధుల కు హర్యానాలో సెలబ్రిటీ హోదా లభిస్తుం ది. వారిని అక్కడి ప్రజలు తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ఉన్న ఫాలోయింగ్‌ను వాడుకోవాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.
బీజేపీకి బ్రిజ్‌భూషణ్ సంకటం
గత ఏడాది వరకు జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, బీజేపీ ఎంపీగా కొన సాగిన బ్రిజ్‌భూషణ్ చరణ్‌సింగ్‌పై మహిళా రెజ్లర్లు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయనను అరెస్టు చేయాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నెలలపాటు టెంట్లు వేసుకొని నిరసన తెలిపారు. ఆ ఆం దోళనకు నాయకత్వం వహించింది బజరం గ్, ఫొగాటే. అయితే, నాడు కేంద్ర ప్రభుత్వం వీరిని లైట్‌గా తీసుకొన్నది. రైతు ఉద్యమాన్ని అణచివేసినట్టే పోలీస్ బలాన్ని ప్రయోగించింది.
అర్ధరాత్రి పోలీసులు వారి టెంట్లను పీకేసి క్రీడాకారుల పట్ల తీవ్ర అభ్యంతరకంగా ప్రవర్తించారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. హర్యానా, పంజాబ్ లో ప్రజల ఈ ఘటనను తమ ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా భావించారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందోనని బీజేపీ భయపడుతున్నది. కాంగ్రెస్ మాత్రం బ్రిజ్‌భూషణ్ ఎపిసోడ్‌నే ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నది. ఇప్పుడు బజరంగ్, వినేశ్ ఎన్నిక ల బరిలోకి దిగితే కాంగ్రెస్‌కు రెట్టించిన బలం వచ్చినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీ ఆత్మ రక్షణ
లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు చవిచూసిన తర్వాత తొలిసారి జరుగుతు న్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం వెనకపడినట్టు కనిపించినా భవిష్యత్తులో తీవ్రంగా దెబ్బ తింటామని బీజేపీ భావిస్తున్నది. హర్యానా, జమ్ముకశ్మీర్‌తోపాటే ఎన్నికలు జరగాల్సిన మహారాష్ట్రలో ఈసీ వివిధ కారణాలు చెప్పి వాయిదా వేసింది. మరో ౨,౩ మూడేళ్లలో ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నాయి. ఇప్పుడు హర్యానాలో ఓడితే అది మహారాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపుతుంది.
అక్కడా ఓడితే ఉత్తరాదిలో ముందుముందు జరిగే ఎన్నికల్లో ఆ పార్టీకి తలబొప్పి కట్టడం ఖాయ మని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతదాకా తెచ్చుకోవద్దని అధిష్ఠానం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కానీ, ఒకవైపు రైతుల వ్యతిరేకత, మరోవైపు క్రీడాకారుల ప్రాబల్యం కలిసి కమల దళాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఎక్కడి నుంచి పోటీ?
వినేశ్ ఫొగాట్ స్వస్థలం చర్ఖిదద్రి. ఆమె పెదనాన్ని కూతురు బబితా ఫొగా ట్ స్వస్థలం కూడా ఇదే. ఆమెను ఇక్కడి నుంచి బీజేపీ పోటీలో దించబోతున్నదని ఊహాగానాలున్నాయి. అదే సమ యంలో ఇక్కడి నుంచి వినేశ్‌ను కాంగ్రె స్ పోటీకి పెడితే సోదరీమణుల పోరా టం అవుతుంది. కానీ, బబితపై పోటీ చేయటానికి వినేశ్ సిద్ధంగా లేదని అంటున్నారు. అందువల్ల జింద్ జిల్లాలోని జులానా స్థానం నుంచి వినేశ్‌ను ఎన్నికల బరిలోకి దించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. బజరంగ్ పూనియా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఆయన రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌తో కూడా సమావేశమయ్యారు. బజరంగ్ బద్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ వాట్స్ ఉన్నా రు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ అగ్రనేత ఓపీ ధన్‌కర్‌ను ఓడించారు. ఇప్పు డు ఆయనను అక్కడి నుంచి కదిలించటం మంచిది కాదని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. సీట్ల సర్దుబాటు కుదరకుంటే బజరంగ్‌కు పార్టీ పదవి ఆఫర్ చేయాలనే ఆలో చనలో ఉన్నట్టు చెప్తున్నారు.