*బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్
హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ అమలులో కాంగ్రెస్ సర్కారు దారుణంగా మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. మాదిగ లను ముంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమేనని ఆయన విమర్శించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతోమాట్లాడుతూ మంత్రిమండలితోపా టు అనేక అంశాల్లో మాదిగలకు కాం గ్రెస్ సర్కారు అన్యాయం చేసిందన్నారు.
ఎస్సీ సబ్ ప్లాన్‌ను సర్కారు నీరుగారుస్తున్నా నోరు మెదపలేని స్థితిలో డిఫ్యూటీ సీఎం భట్టి, స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నారని విమర్శించారు. వర్గీకరణ విషయంలో ఓ మాల సామాజికవర్గానికి చెందిన నేత ద్వారా మాలలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.