- కేంద్రమంత్రి బండి సంజయ్
- గంభీరావుపేట మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభం
సిరిసిల్ల, నవంబర్ 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పొతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో కేంద్రం నిధులు రూ.23 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట వరకు నిర్మించిన వంతెన, లింగన్నపేట నుంచి కోరుట్లపేట వరకు నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తామే ఇచ్చామని ప్రచారం చేసుకుందన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీఆర్‌ఎస్ తోవలో నడుస్తోందన్నారు. కేంద్రంతో వైరం పెట్టుకుం టున్నదన్నారు. తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని బండి సంజయ్ కోరారు.