వరంగల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వచ్చే నెల 7 నాటికి సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా హనుమకొండలో భారీ సభను నిర్వహిస్తుంది. ప్రజాపాలన తొలి విజయోత్సవ సభకు వరంగల్ సిద్ధమైను లక్ష మంది మహిళలతో కాంగ్రెస్ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ విజయోత్సవాలలో భాగంగా వరంగల్ లో తొలి బహిరంగ సభను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి రూ.4,107 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, 110 కోట్లతో నిర్మించబోతున్న ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. ముందు కాళోజీ కాళాక్షేత్రం ప్రారభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వీఐపీల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.