calender_icon.png 25 November, 2024 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీలకే కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యం

26-09-2024 03:32:32 AM

కుంభకోణాలకు ఆజ్యం పోసింది ఆ పార్టీయే

దీన్‌దయాల్ జయంతి వేడుకల్లో ఎంపీ డా.లక్ష్మణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): దేశ సంపద మొదటగా మైనారిటీల కు దక్కాలనేదే కాంగ్రెస్ నాయకుల ప్రధాన అజెండా అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీ య అధ్యక్షుడు, ఎంపీ డా.కే లక్ష్మణ్ విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి కుంభకోణాలతో ప్రభుత్వాన్ని నడిపిందన్నారు.

బుధవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ అవినీతి నిత్యకృత్యమైందన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య పేదలకు చెందాల్సిన భూములను కాజేస్తున్నారని..

ఈ అంశంపై హైకోర్టు సైతం ఫిర్యాదు స్వీకరించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇం దుకు కర్ణాటక సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు మోసపూరితమని ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ  తేలిపోయిం దన్నారు. ఇప్పుడు హర్యానాలోనూ ఏడు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు.

ప్రధాని మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 25 పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పక్షం రోజుల పాటు పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఢిల్లీ వరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు రక్తదాన శిబిరాలు, మెడి కల్ క్యాంపుల రూపంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, రాష్ట్ర కార్యదర్శులు జయశ్రీ, ఉమారాణి, బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.