న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఓ వైపు జార్ఖండ్ లో ఇండియా కూటమి మధ్య సీట్ల షేరింగ్‌పై చర్చలు జరుగుతోన్న సమయంలోనే కాంగ్రె స్ తన అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్‌లో మాజీ ఎంపీ అజయ్ కుమార్‌తో పాటు మంత్రులు బన్నా గుప్తా, దీపికా పాండే ఉన్నారు. అజయ్‌కుమార్ జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి పోటీ చేయనుండగా, జంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి గుప్తా, మహాగమ నుంచి పాండే బరిలోకి దిగనున్నారు.