calender_icon.png 16 November, 2024 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

18-09-2024 11:25:50 AM

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని ఢిల్లీ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాల నాయకులు బహిరంగ బెదిరింపులకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని మాకెన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు కాపీని అజయ్ మాకెన్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కూడా పంపారు.