calender_icon.png 21 September, 2024 | 5:45 AM

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ది అసత్య ప్రచారం

21-09-2024 01:48:53 AM

  1. మల్లన్న సాగర్‌లోని నిల్వ నీరు ఉండడం వారికి చెంపపెట్టు
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, సెప్టెంబరు 20 (విజయక్రాంతి): రైతులకు సాగునీరు అందించేం దుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, మునిగిపోయిందని, డిజైన్ మారడం వల్ల మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి మల్లన్న సాగర్ చెంపపెట్టుగా నిలిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం మల్లన్నసాగర్‌ను సందర్శించి ప్రత్యేక పుజాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. లక్షల కోట్లు వృథా అయ్యాయిని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్‌ను సందర్శిస్తే తెలుస్తుందన్నారు.

ఎల్లంపల్లి, లక్ష్మీబరాజ్, అన్నపూర్ణ బరాజ్, రంగనాయక సాగర్ నిండి అందులోంచి మల్లన్న సాగర్‌లోకి నీళ్లు వస్తాయని, మరి కొట్టుకుపోయిన కాళేశ్వరంలో నుంచి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.93 వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశించారు.