calender_icon.png 22 November, 2024 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ కుంభకోణం.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం

22-11-2024 05:31:39 PM

అమెరికాలో అదాని కుంభకోణం వ్యవహారంలో ప్రధాని మోదీ, బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు  మాట్లాడుతూ... అదాని కుంభకోణం వ్యవహారం అమెరికా రాజ్యాంగం పరిధి అంశమన్నారు. అమెరికా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించిన నాలుగు రాష్ట్రాలు బీజేపీ పాలించినవికావని గుర్తు చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలతో మరో పప్పుల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానితో ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు. దేశ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ ను మూడుసార్లు తిరస్కరించారని.. నిరాధార ఆరోపణలతో రాహుల్ గాంధీ మాట్లాడితే బీజేపీ  నాయకత్వంలో నాలుగోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు.