డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి
చేవెళ్ల, జనవరి 30: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైం దని డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం చేవెళ్ల మండలం తల్లారం గ్రామంలోని గాంధీ విగ్రహానికి నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారం టీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి నేటికి 420 రోజులు పూర్తయినా.. అర హామీ కూడా అమలు కాలేదని మండి పడ్డారు.
జనవరి 31వ తేదీ వరకు రైతు బంధు ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ మాటమార్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ నిరం తరం పోరాటుందని అన్నారు.
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, బీఆర్ఎస్ నాయకులు కె.శేఖర్, బ్యాగరి సుదర్శన్, మాణిక్యరెడ్డి, జైపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పండరి, ఉపేందర్‌రెడ్డి, పుథ్వీ, మాజీ ఎంపీటీసీ ఎల్లన్న, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ముడిమ్యాల్, మహారాజ్ పేట గ్రామాల్లో..
చేవెళ్ల మండలం ముడిమ్యాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోనె కరుణాకర్ రెడ్డి, శేరి రాజు ఆధ్వర్యంలో, శంకర్పల్లి మండల పరిధి మహారాజ్‌పేట్ గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు.
ఓ మహాత్మా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి.. హామీలు నెరవేర్చేలా వారికి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ ఆరిఫ్, వెంకటేశ్, కృష్ణ, ఆప్సర్, అనీఫ్, సూర్యపేట మహేందర్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.