calender_icon.png 22 April, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌చట్టం ఆపే శక్తి కాంగ్రెస్‌కు లేదు

22-04-2025 02:10:49 AM

రేవంత్ రెడ్డి... చట్టం అమలు చేయను అనడానికి నీవెవరు? 

బక్వాస్ మాటలు వద్దు, నీ భరతం పడతాం, బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజం 

మేడ్చల్, ఏప్రిల్ 21(విజయ క్రాంతి): వక్ఫ్ చట్టాన్ని ఆపే శక్తి కాంగ్రెస్ కు లేదని బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నా రు. సోమవారం బోడుప్పల్ లో జన జాగరణ అభియాన్ లో భాగంగా వక్ఫ్ చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో  ఈ చట్టాన్ని అమలు చేయ ను అనడానికి నీవు ఎవ రు అని ప్రశ్నించారు. అసలు నీకు జ్ఞానం ఉందా, రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చి, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన నువ్వు చట్టం అమలు చేయను అనడం అవివేకమన్నారు.

బ క్వాస్ మాటలు వద్దు, నీ భరతం పడతాం అంటూ తీవ్రస్థాయి లో మండిపడ్డారు. 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ సంస్కా రం కోల్పోయిందన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడారో, ప్రస్తుతం ఏమి మాట్లాడుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఈ చట్టానికి వ్యతిరే కంగా మాట్లాడుకున్న నాయకులు చిల్లర రాజకీయాల కోసం లక్షల మంది జీవితాలతో ఆడుకోవద్దన్నారు.

బోడుప్పల్లో అనేకమంది స్థలాలు కొనుక్కొని అన్ని అనుమతులతో ఇల్లు ని ర్మించుకున్నారని, ఆ స్థలాన్ని 2018 లో వక్ఫ్ భూమి అని ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రకటనతో అనేకమంది ఆవేదనతో ఉన్నారన్నారు. జహీరాబాద్ లో తరతరాలుగా సాగు చేసుకుంటున్నా భూముల్లో వక్ఫ్ భూమి అని బోర్డు పెట్టారన్నారు. వక్ఫ్ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదని, ఎవరికి అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజె పి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మహబూబ్ పాషా, చంద్రారెడ్డి, శోభా రెడ్డి, కార్పొ రేటర్ పవన్ రెడ్డి, విజయ్ కుమార్, నరసింహ, మహేష్, రవి, గోన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.