calender_icon.png 9 October, 2024 | 8:52 AM

కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మలేదు

09-10-2024 02:29:02 AM

బీజేపీని నిలువరించేది ప్రాంతీయ పారీలే 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ గారడీలను హర్యానా ప్రజలు తిప్పికొట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారెంటీ లతో ప్రజలను నిలువునా మోసంచేసి, ఏడు గ్యారెంటీలతో హర్యానా ప్రజలను మభ్య పెట్టాలనుకుంటే చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారన్నారు. ఈ మేరకు మంగళవా రం  ఓ ప్రకటన విడుదల చేశారు.

గ్యారెంటీలకు ఇక వారెంటీ లేదన్నది తేలిపోయిందన్నా రు.  ఆ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ బలహీన నాయకత్వమూ ఓ కారణమని, దేశం లో బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందని తేలిందన్నారు. ఈ ఫలితాలను చూస్తుంటే 2029లో బీజేపీ, కాంగ్రెస్‌లకు సాధారణ మెజార్టీ సాధ్యం కాదన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు.