calender_icon.png 19 April, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ ధర్నా

17-04-2025 12:40:57 AM

ఖమ్మం, ఏప్రిల్ 16( విజయక్రాంతి ):- ఏఐ.సి.సి అగ్రనేతలు శ్రీమతి సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ పై చార్జిషీటు దాఖలుకు నిరసనగా  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్ర సాద్ ఆధ్వర్యంలో ఖమ్మం జీ.ఎస్టీ ఆఫీస్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ  పై సోనియా గాంధీ  పై ఈ .డి.ఇన్కమ్ టాక్స్ కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీని ఇ బ్బంది.

పెట్టే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీపై ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి పిలుపుమేరకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ,ఈ దేశంలో బీజేపీ నిరంకుశ పాలన మోడీ, షా ల అరాచకత్వం  ప్రతిపక్ష పార్టీని నేరుగా ఎదుర్కోలేక మా అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీ సోనియా గాంధీ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మీ జేబులో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలను వాడుకొని ఈడి ఇన్కమ్ టాక్స్ లాంటివి మీ ఇంట్లో పని మనుషుల్లాగా ఉసిగొలిపి రాహుల్ గాంధీ సోనియా గాంధీ పై కేసులు బనాయించి వారిని దెబ్బతీసే విధంగా వారి వ్యవహార శైలి ఉందన్నారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు  మాట్లాడుతూ, దేశంలోని రాహుల్ గాంధీ  కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని ఇట్లాంటి ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఇట్లాంటి ఆరోపణలు ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని మీరు ఏమీ చేయలేరని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వీరితోపాటు మేయర్ పి నీరజ, నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వహక అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి,ఖమ్మం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, ఆత్మ కమిటీ ఛైర్మన్ దిరిశాల చిన్న వేంకటేశ్వరరావు,నగర కార్పొరేటర్లు మిక్కిలినేని మంజులనరేందర్, పైడిపల్లి కవితసత్యనారాయణ, మలీదు వేంకటేశ్వరరావు,లకావత్ సైదులు నాయక్,కొప్పేర సరిత ఉపేందర్,మండడపు లక్ష్మీ మనోహర్, గజ్జల లక్ష్మీ వెంకన్న,పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి, కమర్తపు మురళీ, రాపర్తి శరత్, కన్నం వైష్ణవిప్రసన్నకృష్ణ, ముస్తఫా రఫీదా బేగం,జిల్లా అనుబంధ సంఘ అద్యక్షులు కొత్తా సీతారాములు,సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జెల్లి వెంకన్న, షేక్ రషీద్, నగర కాంగ్రెస్ అనుబంధ సంఘ అద్యక్షులు నరాల నరేష్, బాణాల లక్ష్మణ్, షేక్ అబ్బాస్ భేగ్, నగర కాంగ్రెస్ నాయకులు తదితర ముఖ్య నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అత్యదిక సంఖ్యలో పాల్గొన్నారు.