04-04-2025 12:41:25 AM
మధుసూదనా చారి
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): వంచన, ద్రోహానికి కాంగ్రెస్ పార్టీ మారుపేరు అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్య పెట్టిందని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషను, సంవత్సరానికి బడ్జెట్‌లో 20 వేల కోట్లు, బీసీ సబ్ ప్లాన్ అని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రతిపాదించి అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే 42 శాతానికి చట్టబద్దత వస్తుందని.. రాష్ర్ట ప్రభుత్వం ఏం ప్రయత్నం చేసినా బీఆర్‌ఎస్ సహకరిస్తుందన్నారు. లంగ్ స్పేస్‌గా పని చేస్తున్న హెచ్‌సీయూ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దన్నారు. సమావేశంలో కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.