calender_icon.png 18 January, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విభజించటమే కాంగ్రెస్ కల్చర్

18-09-2024 04:24:01 AM

  1. బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పద్ధతి లేదు 
  2. గణేష్ నవరాత్రులు పూజ మాత్రమే కాదు 
  3. అది మన సమాజం ఐకమత్యానికి గుర్తు 
  4. ఒడిశా పర్యటనలో ప్రధాని మోదీ

భువనేశ్వర్, సెప్టెంబర్ 17: విభజించి పాలించటమే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని, ఆ పార్టీ గణేష్ ఉత్సవాలు, పూజలను కూడా భరించలేకపోతున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఈ నెల 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో ప్రధాని గణపతి పూజలో పాల్గొన్న విషయం తెలిసిందే. న్యాయాధిపతి ఇంటికి రాజకీయ నాయకుడు వెళ్లటం ఏంటని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. మంగళ వారం ఒడిశాలో పర్యటించిన మోదీ ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

‘గణేష్ చతుర్ధి అనేది ఈ దేశంలో నమ్మకా నికి మాత్రమే సంబంధించిన పర్వదినం కాదు. స్వాతంత్య్రోద్యమంలో కూడా ఈ పండుగ అత్యంత కీలకపాత్ర పోషించింది. అధికార దాహంతో మన సమా జంలో కులం, మతం, వర్గం పేరుతో విభజన తీసుకొచ్చి విభజించు పాలించు సిద్ధాంతంతో విషం చిమ్మిన సమయం లో లోకమాన్య తిలక్ భారతీయ ఆత్మను జాగృతం చేసి బహిరంగ ప్రదేశాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించే విధానాన్ని ప్రారంభించారు.

నేడు అధికార దాహం తో ఉన్నవాళ్లు సమాజాన్ని విభజించి విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే వారికి గణేష్ ఉత్సవాలు కూడా సమస్యగా కనిపిస్తున్నాయి. నేను గణేష్ పూజలో పాల్గొనటంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నది’ అని పేర్కొన్నారు. 

21న అమెరికాకు మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విదేశాంగశాఖ మంగళవారం ప్రకటించింది. 21వ తేదీన డెలా వేర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్‌లో జరిగే క్వాడ్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తన సొంత పట్టణంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

22వ తేదీన న్యూయార్క్‌లోని నస్సావ్ వెటరన్స్ మమోరియల్ కొలీసియ్‌లో ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీ పాల్గొంటారు. అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 23వ తేదీన నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ సదస్సులో మోదీ ప్రసంగిస్తారు.