calender_icon.png 28 September, 2024 | 12:59 PM

బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ మొసలికన్నీరు

27-09-2024 12:36:57 AM

  1. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు
  2. రజక, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ ఎత్తేశారు
  3. చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఓవైపు బీసీ కులగణన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. మరోవైపు రాహుల్‌గాంధీ మాత్రం రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేస్తామంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా కే లక్ష్మణ్ విమర్శించారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సంద ర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

నిజాంపై పోరాడిన గొప్ప పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం సంతోషమేనని.. అయితే నిజాం మీద పోరాడి విము క్తి సాధించిన సందర్భాన్ని విమోచన దినోత్సవంగా జరుపుకోలేని దుస్థితిలో ఈ సర్కార్ ఉందన్నారు. ఐలమ్మ పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రజకులు, నాయీ బ్రాహ్మణుల కోసం 200 యూనిట్ల ఉచిత పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఏదో సాకులతో కరెంట్ చార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తోందన్నారు.

బహుజన రాజ్యం నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం దిగిరావాల్సిందేనన్నారు. రజక, నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రజలకు ప్రభు త్వం అండగా నిలబడాల్సిందేనని డిమాండ్ చేశారు. కుల వృత్తులపై ఆధారపడే వారి కోసం ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి శిక్షణతో పాటు పరికరాలు కూడా అందించి నట్లు తెలిపారు. వారికి రుణాలు కూడా అందించి కేంద్రం అండగా నిలిచిందన్నారు. మాజీమంత్రి కృష్ణాయాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.