మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ 26వ డివిజన్ కార్పొరేటర్ బాబు తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender) సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. బాబుకు ఈటెల రాజేందర్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నందున అనేకమంది ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. దేశ సమగ్రత కాపాడేది ఎన్ డి ఏ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రం రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి, బీజేపీ జవహర్ నగర్ పశ్చిమ అధ్యక్షుడు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.