27-04-2025 10:06:41 PM
నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన కమ్యూనిస్టులతో ఎరుపెక్కిన మునుగోడు..
పార్టీలు వేరైనా మనందరం ఒకటే పేదల అభ్యున్నతికి తోడ్పడాలి..
మునుగోడు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేద్దాం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తాం..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..
మునుగోడు (విజయక్రాంతి): పార్టీలు వేరైనా మనందరం ఒకటే పేదల అభ్యున్నతికి తోడ్పడి, మునుగోడు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy), సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని పిఆర్ఆర్ గార్డెన్లో శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీని సన్మానించి మాట్లాడారు. కొత్తగూడెం మునుగోడు రెండు టికెట్లు సిపిఐకి కేటాయించాలని ఆరోజు నిర్ణయం జరిగింది అని అన్నారు.
నన్ను సిపిఐ వాళ్ళు గెలిపించారు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చిందని తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పార్టీ చేతులు కలిపింది, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు విషయంలో సిపిఐ పాత్ర చాలా ఉంది. కాంగ్రెస్ సిపిఐ ఏకమైతే వేరే పార్టీనే ఉండదు ఇక్కడ, గతంలో టిఆర్ఎస్ రిజర్వాయర్లు కట్టింది గాని నీరు ఎక్కడి నుండి తీసుకురావాలో చెప్పలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎదుల్ల రిజర్వాయర్ నుండి శివన్న గూడెం వరకు నీరు వచ్చేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత నాతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పైన ఉంది.
హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు, నియోజకవర్గ అభివృద్ధికి నాతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిసి పనిచేస్తాం. పేదవాడి ఆకలి నింపడానికి సన్నబియ్యం పథకం ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉత్తంకుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవాడు కడుపునిండా అన్నం తింటున్నాడు అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 500 కి సిలిండర్ ఇస్తున్నాం. ఉచిత కరెంటును ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పార్టీలకతీతంగా నిజమైన లబ్ధిదారులకు, నిజమైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా ఇద్దరం కృషి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసిమెలిసి పోటీ చేసి దేశము మొత్తం చెప్పుకునేలా కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కలిసి మునుగోడు నియోజకవర్గంలో పనిచేస్తాం అని అన్నారు.
సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... జాతీయ కాంగ్రెస్ పార్టీ రెండు వాగ్దానాలు ఇచ్చిందని ఒకటి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇంకొకటి సిపిఐ పార్టీకి ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి నామినేషన్ రోజే మునుగోడుకు ఎమ్మెల్సీ అని ప్రకటించడం జరిగింది.రాజగోపాల్ రెడ్డి చొరవతో జాతీయ నాయకత్వాన్ని అంగీకరింపజేసి మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ తీసుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి హామీ కూడా పూర్తవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగానే సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదిరాక అవగాహన ప్రకారం ముందుకెళ్తేనే ప్రజల విశ్వసిస్తారు. ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యం ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. ఆదిపత్య పోరు ఉండదు. దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో ఉంది దేశాన్ని రక్షించడం కోసం కమ్యూనిస్టులు కాంగ్రెస్ లు ఐక్యంగా ఉండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చింది. కచ్చితంగా సత్యానికి ఎమ్మెల్సీ రావాలి అని కోరుకున్నారు. ఆయన కల్మషం లేకుండా మద్దతిచారు వారికి అభినందనలు, నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం శ్రమిస్తున్నారు. వారితో పాటు నేను కూడా కలిసి అభివృద్ధి కోసం శ్రమిస్తాం. అభివృద్ధి పక్షాన పీడిత ప్రజల పక్షాన కమ్యూనిస్టు నాయకులు ఎందరో పాటుపడ్డారు. ఇద్దరం సోదరుల్లాగ కలిసికట్టుగా అభివృద్ధి కోసం పని చేస్తాం, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే మనకు ఇంకా ధైర్యం వస్తుందని అన్నారు. అభినందన సభలో పాల్గొన్నవారు ఉమ్మడి నల్గొండ జిల్లా టిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, మున్సిపల్ చైర్మన్ వేణు రెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జీవనపల్లి సైదులు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.