హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్, (విజయక్రాంతి): బీసీ కమిషన్ పనితీరుపై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ కాంగ్రెస్ కమిషన్లా తయారైందని ఆరోపించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిషన్ మీద ఉన్న గౌరవంతో ఇక్కడికి వస్తే మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.