calender_icon.png 24 November, 2024 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ మోసం

06-11-2024 12:04:50 AM

  1. ఇచ్చిన హామీలు నేరవేర్చి రాహుల్ తెలంగాణకు రావాలి
  2. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

సిరిసిల్ల, నవంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి మోసం చేసిందని, ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నేరవేర్చాకే రాహుల్‌గాంధీ రాష్ట్రానికి రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నా రు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేశామంటూ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పేపర్లలో యాడ్స్ ఇస్తూ అక్కడి ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో దేవాలయాలపై, లవ్ జీహాద్ పేరిట హిందూ యువతులపై దాడు లు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నా రు.

దుండగలను శిక్షించకుండా వారిని రక్షించేందుకు ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపిం చారు. తాజా మాజీ సర్పంచ్‌లను అప్పుల పాలు చేసింది బీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. మూసీ నది ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, రూ.లక్షల కోట్లు ప్రజా ధనం దుర్వినియోగం చేస్తామంటే ఊరుకోబోన్నారు.

రాహుల్‌గాంధీకి దమ్ముంటే ఆరు గ్యారంటీలపై తెలంగాణ యాత్ర చేపట్టాలని బండి సంజయ్ సవాల్ చేశారు. అంతకుముందు మామిడిపల్లి ఆలయంలో బండి సంజయ్ పూజలు చేశారు. వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్‌రెడ్డి స్వామి వారి ప్రసాదాలను అందజేశా రు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జి చెన్నమనేని వికాస్ ఉన్నారు.