calender_icon.png 9 January, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌వి చౌకబారు రాజకీయాలు

30-12-2024 03:50:17 AM

* సోనియా సూపర్ పీఎంగా వ్యవహరించారు

* గాంధీయేతర నేతలను ఎన్నడూ గౌరవించలేదు

* కాంగ్రెస్ పాపాలను చరిత్ర క్షమించదు 

* బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి నడ్డా

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. మన్మోహన్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయిస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పిందని, ఆ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశామని చెప్పా రు. 2002 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా వ్యవహరిస్తే..

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ‘సూపర్ పీఎం’గా వ్యవహరించారని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ నేతలు బీజేపీపైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మన్మోహన్ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అనవసర రాజ కీయాలు చేస్తున్నారని విమర్శించారు.

2013 లో మన్మోహన్ క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ పత్రాలను చింపివేయడం ద్వారా ఆయనను రాహుల్ గాంధీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుం బానికి చెందని కాంగ్రెస్ నేతలను గౌరవించే సంస్కృతి గాంధీ కుటుంబానికి లేదని  మండిపడ్డారు. మాజీ ప్రధాని పీవీ కోసం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కోరితే అందుకు సోనియా అంగీకరించలేదని, ఏఐసీసీ ఆఫీసులో ఆయన పార్థివదేహాన్ని ఉంచ డానికి కూడా అనుమతించలేదన్నారు.

ఢి ల్లీలో అంత్యక్రియలు నిర్వహించడం కూడా ఇష్టం లేదని, హైదరాబాద్‌లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారని పేర్కొన్నారు. కానీ మోదీ ప్రభుత్వం 2015లో పీవీకి స్మారక చిహ్నం నిర్మించి, 2024లో భారతరత్న ఇచ్చి గౌరవించిందని నడ్డా తెలిపారు. దాదాపు దేశంలోని 600 సంస్థలకు నెహ్రూ కుటంబం పేర్లు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన పాపాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదని అన్నారు.

ప్రణబ్ ముఖర్జీ మరణించినపుడూ కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేసి సంతాపం తెలపలేదని విమర్శించారు. దేశ తొలి సిక్కు ప్రధానికి అవమానం జరిగిందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఇందు లో సిక్కు మతం ప్రస్తావన ఎందుకు వస్తుం దో తనకు తెలియదని, కానీ ఆయన పదేళ్లు పీఎంగా సేవలందించారని తెలిపారు. సిక్కు అయినందుకు ఆయనను ప్రధానిగా నియమించలేదని పేర్కొన్నారు.  

వాస్తవాలను దాస్తున్నారు: కేంద్రమంతి పూరీ

కల్పిత కథలతో వాస్తవాలను దాయడానికి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రయత్ని స్తున్నారని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ ఆరోపించారు. నిగంబోధ్ వద్ద అంత్యక్రియలు నిర్వహించినా మన్మోహన్‌ను కేంద్ర అవమానించిందని రాహుల్, కాంగ్రెస్ నేతలు ఆరో పించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ని ర్వహించాలని ఆ రోజు నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ ఆదేశించారని తెలిపారు.

అలాగే స్మారక చిహ్నం కోసం ఖర్గే చేసిన అభ్యర్థనను కూడా కేంద్రం అంగీకరించిందన్నారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణల పై ఆయన స్పందిస్తూ.. ఇది చౌకబారు రాజకీయాలకు సమయం కాదన్నారు. పీవీ, ప్రణ బ్ ముఖర్జీ అంత్యక్రియల విషయంతో సోని యా, రాహుల్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. మన్మోహన్ చితాభస్మాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు గాంధీ కు టుంబానికి చెందిన వారు కాని, కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా లేరని ఆయన మండిపడ్డారు.

మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి అంతిమయాత్రలో మోదీ, అమిత్ షా సహ కేంద్రమంత్రులు నడిచారని తెలిపారు. కానీ కాంగ్రెస్ వాళ్లు ప్రతిదానిలో వేలు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.  1984 సిక్కు అల్లర్ల సందర్భంగా 3,000 మంది సిక్కులను చంపేశారని, ఒక పెద్ద చెట్టు పడిపోతే భూమి కంపిస్తుందని రాజీవ్‌గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.  

యమునలో అస్థికలు నిమజ్జనం..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబసభ్యులు యమునా నదిలో నిమజ్జనం చేశారు. ఆదివారం ఉదయం నిగంబోధ్  ఘాట్ నుంచి మన్మోహన్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు సేకరించారు. అనంతరం యమునా నది సమీపంలోని ‘మజ్ను కా తిలా’ గురుద్వారా సమీపంలో సిక్కు సంప్రదాయం ప్రకారం అస్థికలను నిమజ్జనం చేశారు.

కార్యక్రమంలో మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపిందర్ సింగ్, అమృతా సింగ్, దమన్ సింగ్, బంధువులు పాల్గొన్నారు. కాగా జనవరి1 న ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని మన్మోహన్ సింగ్ నివాసంలో అఖండ్ పథ్ కార్యక్రమాన్ని  నిర్వహించనున్నారు. 3న పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలోని రకాబ్ గంజ్ గురుద్వారా వద్ద భోగ్ వేడుక అంతిమ్ అర్దాస్, కీర్తన్ జరగనున్నాయి.