* గతంలో చేసిన పనులు మేమే చేశామని చెప్పడం సిగ్గుచేటు
* బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య
* మల్కపేట రిజర్వాయర్ పరిశీలన
కోనరావుపేట, జనవరి 12: కాంగ్రెస్ పార్టీ ఇది మేమేచేశాం, అది మేమేచేశాం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమి లేదని విమర్శంచారు. అలువగాని హామీలు ఇచ్చి, గత ప్రభుత్వం చేసిన పనులు తామే వని చెప్పుకోంటూ పబ్బం గడపడం తప్ప మరేమి లేదని బీఆర్‌ఎస్ నేతలు దుయ్యబ ట్టారు. ఆదివారం కోనరావుపేట మండలం లో మల్కపేట రిజర్వాయర్ను సందర్శిం చారు.
ఈసందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య మాట్లా డుతూ గత ప్రభుత్వం మల్కపేట రిజర్వా యర్ పనులను 95శాతం మేర పూర్తి చేసి, రెండు మోటార్ల ట్రయల్ రన్ విజయ వంతంగా పూర్తి చేసి 1టీఎంసీ నీటిని నింపిం దన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకు లు ఇటీవల ప్రాజెక్టును సందర్శించి రెండు టీఎంసీల నీరు నింపిమాని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు.
కొన్ని గంటల పాటే మోటార్లు నడిపి 2 టీఎంసీల నీటిని నింప మని రైతులకు అండగా ఉంటామని చెప్పడం సిగ్గుచేటన్నారు. రెండు టీఎంసీల నీరు ప్రాజెక్టులో నింపితే ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రైతులు, ప్రజల పట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఫోటో లకు మాత్రం ఫోజులిస్తున్నారని పేర్కోన్నా రు. ఇప్పటి వరకు మల్కపేట రిజర్వాయరు తట్టెడు మట్టి కూడ పోయలేదని ఆరోపించా రు.
రైతులకు అండగా ఉంటే ఎక్కడి కాలువ లు అక్కడే ఎందుకు పూరు కుపోతున్నా యని ప్రశ్నించారు. మాయమాటలు చెప్ప కుండా రైతులపై చిత్తశుద్ధి ఉంటే రైతు రుణమాఫీ, రైతు భరోసా అందించడంతో పాటు సాగునీటి కరువు లేకుండా చూడాలని పేర్కోన్నారు. అలాగే రాజకీ యంగా ఎదుర్కొనలేక బీఆర్‌ఎస్ పార్టీలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని గుర్తు చేశారు.
లేదంటే రాను న్న ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలే తరిమికొడతారని పేర్కోన్నారు. ఇక్కడ నేతలు ఎదురగట్ల చంద్రయ్యగౌడ్, గోపు పర్శరాములు, మంతెన సంతోష్, మందాల శ్రీనివాస్, ఆరె మహేందర్, కాసర్ల రాజు, రమణారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.