బెల్లంపల్లి,(విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకుంటామని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్ అన్నారు. శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో పనిచేసిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ నాయకత్వంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బాకం మల్లేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమడుగుల మహేందర్, బూట్ల వెంకట లక్ష్మి, మంద అనిత, బరిగెల రఘుతో పలువురు నాయకులు ఉన్నారు.