calender_icon.png 12 January, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రకటన

12-01-2025 12:49:08 AM

 పరిశీలనలో నలుగురి పేర్లు నరేందర్ రెడ్డివైపే అధిష్టానం మొగ్గు బీజేపీ నిర్ణయంపై సీనియర్ల గుర్రు

కరీంనగర్, జనవరి 11 (విజయ క్రాంతి): కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిని బీజేపీ ప్రకటించడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించింది.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు శనివారం కాంగ్రెస్ అభ్యర్ధిని మూడు రోజుల్లో ప్రకటిస్తామని ప్రకటిం చారు. ప్రచారంలో దూసుకుపోతున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేరును ఎక్కువ మంది ప్రతిపాది స్తున్నట్లు మహేష్ కుమార్గ్రౌడ్ చెప్పకనే చెప్పారు.

అయితే పరిశీలనలో నలుగురి పేర్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వెలిచాల రాజేందర్రావు, ఆసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రనన్న హరికృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి తిరిగి పోటీ చేయాలా, వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో ఆయనకు బదులు మరొక అభ్యర్థిని ప్రకటించాలనే ఆలోచనలో పీసీసీ ఉంది. వెలిచాల రాజేందర్రావుకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించి ఆయనను బుజ్జగించి, నరేందర్‌రెడ్డి పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రసన్న హరికృష్ణ పేరు మొదట్లో బలంగా వినిపించినా ఆయన ప్రచారంలో వెనుకబడదు, నరేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతుండడంతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో పార్టీ నిర్వహించిన సర్వేలో నరేందర్ రెడ్డికి అనుకూలంగా రిపోర్టు వచ్చినట్లు తెలిసింది. చివరి క్షణం వరకు కాంగ్రెస్లో ఏదైనా సాధ్యం కనుక నలుగురిలో ఎవరికి టికెట్ వస్తుందన్నది నాలుగు రోజుల వరకు వేచి చూడవలసిందే.

ఇదిలా ఉంటే నరేందర్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపకట్స్ మున్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహలను పలుమార్లు కలిసి పార్టీ టికెట్ ఇస్తే గెలిచి వస్తానని, తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆయన ఉమ్మడి నాలుగు జిల్లాలు మూడుపర్యాయాలు చుట్టి వచ్చారు.

 బీజేపీ సీనియర్ల అలక..

బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి పేరును అధిష్టానం ప్రకటించడంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అలక వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రెండవసారి తనకు పార్టీ అవకాశం ఇస్తుందని అనుకున్న సీనియర్ నాయకుడు పి సుగుణాకర్రావుకు ఆశభంగం ఎదురయింది.

అలాగే మంచిర్యాల పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘు కూడా టికెట్ ఆశించారు. వీరిద్దరిని కాదని గతంలో బీజేపీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి బీజేపీకి వచ్చిన అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. సుగుణాకర్రావును పోటీలో ఉండాలని సీనియర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఒకటి రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.