calender_icon.png 2 October, 2024 | 11:52 PM

లాపతా లేడీస్‌తో కాంగ్రెస్ ప్రచారం

02-10-2024 01:47:44 AM

  1. రాష్ట్రంలో గతేడాది 64 వేల మంది అపహరణ
  2. అవే పోస్టర్లతో ప్రచారం చేస్తోన్న మహారాష్ట్ర కాంగ్రెస్

ముంబై, అక్టోబర్ 1: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ఇటీవల ఆస్కార్ ఎంపికైన లాపతా లేడిస్ చిత్రాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికలలో ప్రచారం చోస్తోంది. మహారాష్ట్రలో మహిళల భద్రత విషయంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.

సంవత్సరంలో 64 వేల మంది ఆడవాళ్లు కనిపించకుండా పోయారని పోస్టర్లు వేశారు. ఇందులో సీఎం షిండే, ఉపముఖ్య మంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఫొటోలు ఉన్నాయి. ఆగస్టులో అసెంబ్లీలో ఫడ్నవీస్ చేసిన ప్రకటన ఆధారంగా కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తోంది. 2021లో 61 వేల మంది మిస్ అవ్వగా 87 శాతం మంది, అదే 2022లో 86 శాతం మంది తిరిగి వచ్చారు.