calender_icon.png 26 April, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్

25-04-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ 

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రజలకు మోసపూరిత హామీ లిచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ విమర్శించారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై ఆగ్ర హంతో ఉన్నారని చెప్పారు. గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

వరంగల్ రజతో త్సవ సభలో కేసీఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు. ప్రజల్లో మంచి జోష్ కనిపిస్తోందని చెప్పారు. ఉగ్రవాదం వికృతరూపం ఏమిటో పహ ల్గాం ఘటనతో రుజువైందని, అమాయకులను మతం పేరుతో చంపడం అత్యంత విషాదకరమన్నారు.

ఈ ఘోర ఘటనను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వినోద్‌కుమార్ చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీ శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు పల్లె రవికు మార్, పట్నం మాణిక్యం పాల్గొన్నారు.