calender_icon.png 4 April, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్

04-04-2025 12:23:13 AM

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రిపల్లి, ముద్విన్, బోయిన్ గుట్టతండాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

కడ్తాల్, ఏప్రిల్ 3 ( విజయ క్రాంతి ) : అబద్దాల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్, మర్రిపల్లి, బో యిన్ గుట్ట తండాలో మాజీమంత్రి హరీష్ రావు, మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటించారు.

ఈ సందర్భంగా మర్రిపల్లి గ్రామంలో బిఆర్ ఎస్ జెండా ఆవిష్కరణ అ నంతరం ముద్విన్ గ్రామంలో రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో నీరు పేద మహిళకు నూతనంగా నిర్మించిన నూతన ఇల్లును హరీష్ రా వు ప్రారంభించారు... అక్కడి నుంచి బోయిన్ గుట్ట తండాలో నూతనంగా ఏర్పాటుచేసిన మహనీయులు మహాత్మాగాంధీ, అంబెడ్కర్, సంతూ సేవాలాల్ మహారాజ్ విగ్రహాల ను ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఏడాదంతా రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంత సగం సగం అని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని రాష్టంలోని అన్ని దేవాలయల మీద ఒట్టు పెట్టిన అయినా నేటికీ అమలు చేయడం లేదని విమర్శలు గుప్పించారు.

ఎక్కడ సభలో సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు తాను నల్లమల బిడ్డనని... గొప్పలు చెప్తారు కానీ పాలమూరు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతుబంధు వేసిండు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబందుకు రెండు సార్లు ఎగనామం పెట్టిందని హరీష్ రావు ఆరోపించా రు.

గ్రీన్ ఫీల్ రోడ్డు పేరుతో రియల్ వ్యాపారానికి తెరలేపి...12వందల ఎకరాలు గుంజు కునే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే ఉండగా మరో గ్రీన్ ఫీల్ రోడ్డు అవసరమా అని ప్రశ్నించారు. ఆర్ గ్యారంటీ ల పేరిట ఊకదంపుడు ప్రసంగాలు చేశారని... ఎన్నికల ముందు ప్రకటించిన  ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, రూ.2500ఇస్తానని హామీ ఇచ్చారని... ఇప్పుడు ఆమె ఏమైందని... ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని రాను న్న రోజుల్లో ప్రజలు నిలదీశే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

హెచ్. సి. యూ లో మూగ జీవాలు రోదిస్తుంటే... సీఎంకు కనీసం చీమకుట్టినట్లు లేదని ఆయన గ్యాస్ అంతా భూములు అమ్ముకం పై నే ఉందని హరీష్ రావు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తానంటూ ఢిల్లీ ధర్నాకు వెళ్లిన రేవంత్ రెడ్డి... ఆ ధర్నాకు రాహుల్ గాంధీ ఎందుకు తీసుకు రాలేదని సెటైర్లు విసిరారు.

ముద్విన్ గ్రామంలో నూ తనంగా ఇల్లు నిర్మించిన రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్ ను మం త్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. అంతకుముందు కడ్తాల్ మం డల కేంద్రానికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిని టిఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మా నించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, రాంబాల్ నాయక్, మాజీ జెడ్పిటిసి విజితారెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఏడ్మా సత్యం, సింగల్ విండో చైర్మన్ వెంకటేష్ గుప్తా, నాయకులు ఎడ్మ అర్జున్ రావు, జోగు వీరయ్య, హరిచంద్ నాయక్, నర్సింహా గౌడ్, ఆనంద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.