calender_icon.png 3 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కింది

03-02-2025 12:00:00 AM

  1. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి 
  2. బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 

చేవెళ్ల , ఫిబ్రవరి 2 : రేవంత్రెడ్డి సర్కార్ సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధి జన్వాడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్రెడ్డి సమక్షంలో 150 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

వారికి సబితారెడ్డి, కార్తీక్రెడ్డిలు బీఆర్‌ఎస్ కండు వాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వా నించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రజా ప్రభుత్వానికి చేతకావడం లేదని, ఎక్కడ చూసినా ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడే బావుండేదని గుర్తు చేసుకుంటూ బాధపడు తున్నారని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు బీఆర్‌ఎస్తోనే సమన్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో బీఆర్‌ఎస్ పార్టీలోకి వలసల జోరుగ పెరుగుందని గుర్తు చేశారు. ఏదేమైనా బీఆర్‌ఎస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని, పార్టీకోసం కష్టపడ్డ ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా నిలిచి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారిలో పోతురాజు సురేష్, వడ్ల నాగరాజు, మోత్కుపల్లి శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, 50 జన్వాడ ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు గంచెర్ల గోవర్ధన్రెడ్డి, ఉద్యమకారుడు దేశమెల్ల ఆంజనేయులు, నాగేందర్‌గౌడ్, బద్దం శశిధర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, లింగం ముదిరాజ్, గౌడిచెర్ల నర్సింలు, రంగయ్య గారి శ్రీనివాస్, బ్యాగరి సుదర్శన్, మహ్మద్ ఎజాస్, ఫయూం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.