calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వచ్చాకే డ్రగ్స్‌పై ఉక్కుపాదం

28-10-2024 02:47:10 AM

ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు

విశ్వనీయ సమాచారంతోనే ఎస్‌ఓటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, దానిపై స్పందించి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేయడం పరిపాటి. ఫామ్‌హౌస్‌లో వేడుకలను నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను ఎస్‌ఓటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

 ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు 

జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమి సమాధానం చెబుతారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ల జీవితాలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి రేవ్ పార్టీకి హాజరైన వారందరినీ అరెస్టు చేయాలి. 

 ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

కాంగ్రెస్ వచ్చాకే డ్రగ్స్‌పై ఉక్కుపాదం 

 తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ముందు కెళుతున్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో కొందరు బడాబాబులున్నారని వార్తలొస్తున్నాయి, ఎంతటివారున్నా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. పూర్తిస్థాయిలో సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ గుర్తుంచుకోవాలి. 

 ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ 

తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది 

కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్ లో అసాంఘి క కార్యక్రమా లు చూసి తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుపడుతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఇదే సమయంలో కేటీఆర్ ఫామ్‌హౌస్‌లోనే రేవ్ పార్టీలు జరగడం సిగ్గు చేటు. పోలీసుల రైడ్ జరిగే కంటే ముందే రేవ్ పార్టీ నుంచి మరో 20 మంది వరకు వెళ్లిపోయారనే సమాచారం మా వద్ద ఉంది. 

 పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ 

కేటీఆర్ రక్త నమునాలను టెస్ట్ చేయాలి  

కేటీఆర్ డ్ర గ్స్ పార్టీ ము ఠా నాయకు డు. కేటీఆర్‌కు రక్తనమూనాలను పరీక్షిం చాలి. ప్రభుత్వంపై విమర్శలు చేసే కేటీఆర్.. తన బావమరిది ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీపై ఎందుకు స్పందించడం లేదు. రేవ్ పార్టీపై కేటీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇవ్వాలి. రేవ్ పార్టీలను ప్రోత్సహించడమే బీఆర్‌ఎస్ సంస్కృతి. 

 మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి