11-03-2025 01:18:35 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు
జనగామ, మార్చి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువు వచ్చిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ప్రకృతిపై నిందలు వేస్తున్నారని విమ ర్శించారు. సోమవారం జనగామలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే పా లకులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. దేవాదుల కాంట్రాక్టర్లకు రూ.7 వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడం వల్ల 33 రోజులు మోటార్లు ఆన్ చేయలేదన్నారు.
దీంతో రిజర్వాయర్లు నిండలేదని, పొలాలకు నీరు అందలేదన్నారు. గోదావరిలో ప్రవాహం ప్రారం కాగానే మో టార్ ఆన్ చేసి ఉంటే కరువు పరిస్థితులు వచ్చేవి కావన్నారు. సకాలంలో ఓ అండ్ ఎం పనులు చే యకపోవడం వల్లే చె రువులు, కుంటలు నిండలేదన్నారు. కృ ష్ణా నదిలో నీటిని ఏపీ సీఎం చంద్రబాబు ఎత్తుకెళ్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఇప్పటికైనా మోటార్లు ఆన్ చేయించి చెరువులు కుంటలను నింపి, కాల్వల ద్వారా నీటిని విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.