22-04-2025 10:59:26 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు మంగళవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) కలిసేందుకు హైదరాబాద్ కు తరలివెళ్లారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో తలెత్తిన అవకతవకలు, గందరగోళ పరిస్థితులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వివరించారు.
ఇంకా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులను ఎమ్మెల్యే విస్తృతంగా చర్చించారు. ఇందిరమ్మ గృహ పథకం లబ్ధిదారులు ఎంపిక కోసం ఆయా వార్డుల్లో ఏర్పాటుచేసిన వార్డు కమిటీలే కీలక భూమిక పోషిస్తాయని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. వార్డు కమిటీల పర్యవేక్షణ కోసం నెలకొల్పిన 11 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపికలో వార్డ్ కమిటీలే లేదే పూర్తి బాధ్యత తెలిపారు.
ఇక బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సంస్థ గత కార్యక్రమాల వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాలు సైతం బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముచ్చల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్త మరిసూరి బాబులకి అప్పగించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ గెల్లి జయరాం, సిలివేరు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నయీం, సీనియర్ నాయకులు ఢీకొండ రాజలింగు, గెల్లి రాజలింగు, యూత్ కాంగ్రెస్ నాయకులు సన్నీ బాబు, అన్ని విభాగాల నాయకులు ఉన్నారు.