calender_icon.png 19 March, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

11-03-2025 08:02:31 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య సమక్షంలో రూ 200 కోట్ల నిధులతో బెల్లంపల్లి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు.

ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు గౌరవించేలా ఉన్నాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేలా నిధుల మంజూరుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ మరింత కృషి చేస్తారన్న నమ్మకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామిలతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్ట , అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నాయకురాలు రొడ్డ శారద పాల్గొన్నారు.