24-03-2025 12:55:20 AM
జనగామ, మార్చి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో కరువు విలయతాండవం చేస్తోందని, ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని, ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చిన కరువేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
సమయానికి మోటార్ల ను ఆన్ చేయకుండా ఈ ప్రభుత్వం వేడుక చూసిందని, ఫలితంగా లక్షలాది రైతుల నోట్లో మట్టి పడిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఆదివారం ఆయన దేవాదుల ఎత్తిపోతల ఫేజ్ 3లో భాగంగా నిర్మించిన దేవన్నపేట పంపుహౌజ్‌ను బీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా నాయకత్వంలో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడు తూ.. దేవాదుల ఎత్తిపోతలపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ హయాంలోనే దేవాదుల పూర్తి అయినట్లు చెప్పుకో వడం హాస్యాస్పందంగా ఉందన్నారు.
2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దేవాదుల పథకానికి శంకుస్థాపన చేసి వదిలేశార న్నారు. ఆ తరువాత పదేళ్ల పాటు అధికారం లో ఉన్న కాంగ్రెస్ పనులను నిర్వీర్యం చేసిందన్నారు. 2004 నుండి 2014 వరకు అధి కారంలో ఉన్న కాంగ్రెస్ దేవాదుల ద్వారా కేవలం 40 వేల ఎకరాలకే నీరు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఉత్తమ్ కాలు పెడితే ఉన్న మోటార్ ఆగింది..
ప్రభుత్వం సమయానికి మోటార్లు ఆన్ చేయకపోవడం వల్లే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే పల్లా అన్నారు. రోజుకోసారి మోటార్లు ఆన్ చేస్తామని మంత్రులు చెప్పడమే తప్ప పని కావడం లేదన్నారు. ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హనుమకొండకు వచ్చి మోటార్ చేద్దామనుకుంటే, ఆయన కాలు మహత్యంతో అది రిపేరుకు వచ్చిందని ఎద్దేవా చేశారు.
జనగామ ప్రాంతంలో తపాస్ పల్లి, కన్నెబోయిన గూడెం, లద్దునూర్, బొమ్మకూరు, చిటకోడూరు, గండి రామారం రిజర్వాయర్ లకు ధర్మసాగర్ నుంచి నీరు రావాల్సి ఉందన్నారు. ధర్మసాగర్‌కు చలి వాగు నుంచి, చలివాగుకు భీం ఘన్ పూర్ నుంచి, భీం ఘన్ పూర్ కు గోదావరి తీరం నుంచి నీళ్లు వస్తాయన్నారు. గోదావరిలో ఆనాడు ఇంటిక్ పాయింట్ సరిగ్గా లేకుంటే కేసీఆర్ ప్రభుత్వం సమ్మక్క బ్యారేజీని కట్టించిందని గుర్తు చేశారు.
ఇప్పుడున్న ఎండాకాలానికి కావాల్సిన నీళ్లు ఉన్నాయని, వాటి కోసం రిజర్వాయర్లు, మీటర్ల పంపులు ఉన్నాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక టెక్నీషియన్లకు రూ.6 కోట్ల బకాయిలు ఇవ్వలేదన్నారు.
తాను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ నిధులు చేయించానని, అప్పటికే రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందని వాపోయారు. ఇప్పటికైనా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, పంపులు ఆన్ చేసి పొలాలకు నీరు అందించాలని పల్లా డిమాండ్ చేశారు.
దేవాదుల క్రెడిబిలిటీ బీఆర్‌ఎస్‌దే..
దేవాదుల పథకాన్ని 90 శాతం పూర్తి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్ హయాంలో 5 లక్షల14 వేల ఎకరాలకు నీళ్లు అందేలా కృషి చేశామన్నారు. ఫేస్ 1, ఫేస్ 2 పూర్తి చేసి ఫేస్ 3లో భాగంగా రామప్ప దగ్గర నుంచి దేవన్నపేట వరకు టన్నెల్ కార్యక్రమం, దేవన్నపేట దగ్గర నుంచి ధర్మసాగర్ వరకు పంపులకు సంబంధించి రూ.1,250 కోట్ల నిధులు కేటా యించింది కేసీఆర్‌నేనని చెప్పారు.
తాము నిధులు విడుదల చేసి టెండర్లు పూర్తి చేసి టన్నెల్ కార్యక్రమం పూర్తి చేసి మోటార్లు తెప్పిచ్చామన్నారు. కానీ ఆ మోటార్లను ఆన్ చేయాలన్నా ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. మోటార్లు, పంపులు ఎక్కడ ఉంటాయో వారికి తెలియదని, టన్నెల్ గురించి అసలే అవగా హన లేదని ఎద్దేవా చేశారు. మంత్రులు మాత్రం సబ్జెక్ట్ లేకుండా ఏదేదో మాట్లాడుతుంటారని అన్నారు.