* డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే
* మీడియాతోమాజీమంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొనలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాధనలో రేవంత్‌రెడ్డి పాత్ర శూన్యం అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంతో వచ్చిందన్నారు.
కాంగ్రెస్ దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనడం ఉద్యమకారులను, రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని మండిపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎదుగిసిపడుతున్న సమయంలో ఉద్యమకారుల మీదికి రేవంత్‌రెడ్డి రైఫిల్ తీసుకొని వెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు అతనికి లేదన్నారు.