calender_icon.png 28 April, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వెన్నులో వణుకు

28-04-2025 01:42:43 AM

  1. ఎన్ని కుట్రలు పన్నినా సభ విజయవంతం
  2. నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు: హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం నుం చి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంత మైందని, ఇందుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ వచ్చి నిలదీస్తాడనగానే ప్రజా ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అందుకే అడుగు అడుగున పోలీ సుల ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించినట్టు ఆరోపించారు. సభా స్థలికి కార్యకర్తలు చేరకుండా 10 నుంచి 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారని ఆరోపించారు. కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్ సహా అన్నిదారుల్లో వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని..

ట్రాఫిక్ జామ్ పేరిట సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి వందలాది వాహనాలను తిప్పి పంపారని విమ ర్శించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చే దాదాపు వెయ్యికి పైగా వాహనాలను హుస్నాబాద్ దాటిన తర్వాత కొత్తపల్లి నుంచి యూటర్న్ చేసి తిరిగి సిద్దిపేట వైపు మళ్లించారని అన్నారు. ఆర్టీవో స్థాయి అధికారులను అడుగడుగునా పెట్టి వాహనాలు చెక్ చేయించారని.. స్కూల్ బస్సులు అద్దెకు ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు.

బీఆర్‌ఎస్ సభను ఎలాగైనా అడ్డుకో వాలని దుష్టపన్నాగాలను కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేసిందని.. సహాయ నిరాకరణ చేసి సభను ఫెయిల్ చేసే కుట్ర చేసిందన్నారు. సభకు వచ్చే అన్ని రహదారులను దిగ్బంధం చేసి, కాంగ్రెస్ మరోసారి సంకుచిత బుద్ధిని బయట పెట్టుకున్నదన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పటాపంచలు చేశారని తెలిపారు.

తండోపతండాలుగా తరలివచ్చి గులాబీ జెండా సత్తా చాటారని.. ఇది ఆరంభం మాత్రమేనని, ప్రజలను నమ్మించి నయవంచన చేసిన మీ మోసపూరిత వైఖరికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైనదని కాంగ్రెస్ సర్కార్‌ను హెచ్చరించారు. సభను విజయవంతం చేసిన బీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, టీవీల్లో వీక్షించిన ప్రజలకు హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.