calender_icon.png 9 October, 2024 | 8:47 AM

బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడి గర్హనీయం

04-09-2024 01:19:11 AM

అధికారులను రేవంత్ రెడ్డి తిట్టడం సిగ్గు చేటు

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వరద బాధితులను పరా మర్శిస్తున్న బీఆర్‌ఎస్ నేతల వాహనాలపై కాంగ్రెస్ గుండాల దాడి గర్హనీయమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. దాడిలో కాలికి గాయమైన బీఆర్‌ఎస్ కార్యకర్త త్వరగా కోలుకోవాలని ఆయన ఆ కాంక్షించారు. భారీ వర్షాలతో రెండు రోజులు ప్రజలు ఇబ్బంది పడుతుం టే పట్టించుకోకుండా గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి తీరికగా ఖమ్మం వెళ్లాడని పేర్కొన్నారు. 48 గంటలు తమను పట్టించుకోని ప్రభుత్వం మీ ద ప్రజలు తిరగబడడంతో  అధికారులు, సెక్యూరిటీని రేవంత్ రెడ్డి తిట్టడం సిగ్గు చేటన్నారు. 

ప్రజలకు సాయం చేయలేని ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నాయకుల మీద దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న తీరు గా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపో యిందన్న సోయి సర్కారుకు లేదని, అన్ని విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపుతోందని విమర్శించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు చూసి, మంత్రుల మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని,  ఇప్పటికైనా సర్కారు బుద్ధి తెచ్చుకుని వరద బాధితులకు సహాయం అందించాలని ఆయన సూచించారు.