calender_icon.png 14 April, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆదివాసీ శిక్షణ తరగతులకు హాజరు కావాలి

13-04-2025 12:45:49 PM

ఎమ్మెల్యే మురళి నాయక్ పిలుపు

మహబూబాద్, (విజయక్రాంతి): హనుమకొండలోని హరిత హోటల్లో ఈనెల 19 నుండి 21 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసి, గిరిజన నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ముఖ్య మురళి నాయక్(MLA Murali Nayak) తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లాకు చెందిన ఆదివాసీ, గిరిజన నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, డీ సీ సీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి మాట్లాడుతూ...  కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ, గిరిజనుల కోసం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు భూ హక్కు చట్టాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ జి.వెంకన్న , ఆదివాసీ జిల్లా అధ్యక్షుడు బోడ రవి, ఆదివాసీ జిల్లా వైస్ చైర్మన్ బోడ పద్మతో పాటు ఆదివాసీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.