calender_icon.png 20 October, 2024 | 5:28 AM

కాంగ్రెస్, జేఎంఎం పొత్తు ఖరారు

20-10-2024 03:03:09 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పోటీ చేయనుంది. ఈ మేరకు అధికార జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారైంది. మొత్తం 81 స్థానాలకుగాను 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని సీఎం హేమంత్ సోరెన్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రతినిధి లేని కారణంగా పూర్తి వివరాలు వెల్లడించలేనని తెలిపారు. మిగతా 11 స్థానాల్లో ఇతర కూటమి భాగస్వాములైన ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే సోరెన్ ప్రకటనపై ఆర్జేడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. జేఎంఎం, కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయంటూ ఆరోపించింది. 

66 మందితో బీజేపీ తొలి జాబితా

బీజేపీ మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్డీయే పక్షాలు పొత్తు శుక్రవారమే ఖరారు చేసుకోగా బీజేపీ 66 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం విడుదల చేసి ంది. ధన్‌వాడ్ నుంచి బీజేపీ రాష్ట్ర చీఫ్ బాబులాల్ మరాండీ, జమ్‌తారాలో సీతా సోరెన్, సరైకెలాలో మాజీ సీఎం చంపై సోరె న్, బోరియోలో లోబిన్ హెంబ్రోమ్, పొట్కా నుంచి మీరా ముండాను నిలిపారు. వీరిలో బాబులాల్, చంపై సోరైన్ గతంలో జేఎంఎంలో కీలక నేతలుగా ఉన్నారు. జార్ఖండ్‌లో ని ఎన్డీయేలో బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో బరిలోకి దిగనుంది. జేడీయూ ఒకటి, ఎల్జేపీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కాగా, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. 



*జార్ఖండ్‌లో 70 స్థానాల్లో బరిలోకి రెండు పార్టీలు

*66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల