calender_icon.png 21 February, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌వి తెరచాటు నాటకాలు

21-02-2025 12:45:39 AM

  1. బీఆర్‌ఎస్ దోపిడీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్
  2. హామీల అమలులో ప్రభుత్వం దారుణంగా విఫలం
  3. రాహుల్, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అశోక్‌నగర్ లైబ్రరీకి రావాలి
  4. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలవి తెరచాటు నాటకాలని, ఆ రెండు పార్టీలు వచ్చి ఓట్లడిగితే ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికే అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు.

పదేండ్లలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అదే పంథాను అనుసరిస్తున్నదని, వారి వారసత్వాన్నే వీరు కొనసాగిస్తున్నా రని కిషన్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గురువారం బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిం చారు.

అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి గెలి చాక వాటిని అమలుచేయలేక ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతుందని ఆరోపించారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారసభల్లో ఊదరగొట్టిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులకు ఆ సమాచారం చెప్పాలన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలవడం తథ్యమని జోస్యం చెప్పారు. 

దోపిడీ పెరిగింది..

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దోపిడీ దౌర్జన్యాలు పెరిగాయని కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 317 జీఓ తెచ్చి ఉద్యోగులను ఇబ్బంది పెట్టి మూడు డీఏలను ఎగ వేస్తే.. ఏడాదిలో కాంగ్రెస్ రెండు డీఏలకు ఎగనామం పెట్టిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే స్థితిలో లేకపోవడం దారుణమన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఐటీ స్లాబ్‌లను పెంచి మోదీ ప్రభు త్వం మధ్య తరగతి కుటుంబాలను ఆదుకుందన్నారు. భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగం హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షపడేలా చూడాలని కోరారు.

సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్యగౌడ్, కాసం వెంకటేశ్వ ర్లు, దాసరి మల్లేశం, వట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.